Breaking News | చెట్టును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Breaking News | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో…. ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన షాకింగ్ సంఘటన మహారాష్ట్రలోని పుణే-సోలాపూర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు రాయగడ జిల్లా పన్వెల్ నుంచి సోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్కు దైవదర్శనం కోసం కారులో వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
వేగంగా వెళ్తున్న కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. మృతులను పన్వెల్, ఖార్ఘర్ ప్రాంతాలకు చెందిన మాలా రవి సాళ్వే (40), అర్చన తుకారాం భండారే (47), విశాల్ నరేంద్ర భోసలే (41), అమర్ పాటిల్, ఆనంద్ మాలీలుగా పోలీసులు గుర్తించారు.
