Breaking | ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

Breaking | ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

  • రూ.5 కోట్ల విలువైన బంగారం స్వాధీనం..
  • స్మగ్లర్లకు సహకరించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది..
  • ముగ్గురు విదేశీయులు సహా ఏడుగురు అరెస్ట్..

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీ గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్‌ను ఛేదించారు. ‘ఆపరేషన్ గోల్డెన్ నెక్సస్’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు 3.2 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. వీరిలో బంగ్లాదేశ్, శ్రీలంకకు చెందిన ముగ్గురు ట్రాన్సిట్ ప్రయాణికులు, ముగ్గురు విమానాశ్రయ సిబ్బంది, అలాగే బంగారాన్ని స్వీకరించేందుకు వచ్చిన ఒక రిసీవర్ ఉన్నారు.

విచారణలో భాగంగా విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకువచ్చి, విమానాశ్రయ సిబ్బంది సహాయంతో బయటకు తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ముందస్తు సమాచారంతో చేపట్టిన నిఘా, తనిఖీల ద్వారా ఈ అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను బట్టబయలు చేశారు. నిందితులపై కస్టమ్స్ చట్టం కింద కేసులు నమోదు చేసి, ఈ ముఠా వెనుక ఉన్న అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply