గన్నవరంలో క్రికెట్ మ్యాచ్ బ్యాటింగ్ వివాదం…

బ్యాట్లతో దాడి, ఒకరి పరిస్థితి విషమం

గన్నవరం – ఆంధ్రప్రభ : గన్నవరం బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ బ్యాటింగ్ వివాదం హింసాత్మక ఘర్షణకు దారితీసింది. మ్యాచ్ సందర్భంగా రెండు జట్ల యువకుల మధ్య మాటా మాటా పెరిగి గొడవగా మారింది. ఆగ్రహంలో ఉన్న యువకులు క్రికెట్ బ్యాట్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఈ ఘర్షణలో ఒక యువకుడికి తలకు బలమైన గాయమై పరిస్థితి విషమంగా మారింది.

వెంటనే స్థానికులు 108 ద్వారా అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.