Bjp | పేట మున్సిపాలిటీపై కమలం పట్టు

Bjp | పేట మున్సిపాలిటీపై కమలం పట్టు

చైర్‌పర్సన్‌గా కొండా శ్వేతా సత్య యాదవ్ విజయం
వైస్ చైర్మన్‌గా మంజుల ఎన్నిక – ఉత్కంఠ పోరులో బీజేపీ డబుల్ జయం

Bjp | నారాయణపేట, ఆంధ్రప్రభ : నారాయణపేట పట్టణ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం చాటుతూ రెండు కీలక పదవులను కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఓటింగ్‌లో బీజేపీ అభ్యర్థి కొండా శ్వేతా సత్య యాదవ్ చైర్‌పర్సన్‌గా ఘన విజయం సాధించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రత్యేక అధికారి రామ్ చందర్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా, విజయం అనంతరం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఉత్కంఠ భరిత ఓటింగ్…

చైర్‌పర్సన్ ఎన్నికలో బీజేపీ తరఫున కొండా శ్వేతా సత్య యాదవ్‌కు ఎంపీ డీకే అరుణ ఎక్స్ ఆఫీషియో సభ్యురాలిగా మద్దతు ఇవ్వడంతో పాటు పార్టీ కౌన్సిలర్లు, స్వతంత్ర సభ్యుడి మద్దతుతో మొత్తం 13 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థికి ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి సహా కాంగ్రెస్, మిత్రపక్ష కౌన్సిలర్ల మద్దతుతో 11 ఓట్లు మాత్రమే లభించడంతో పోరు బీజేపీ వైపు మళ్లింది.

వైస్ చైర్మన్ పోరులో కూడా బీజేపీ ఆధిపత్యం

వైస్ చైర్మన్ ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసిన 6వ వార్డు కౌన్సిలర్ మంజుల ఘన విజయం సాధించారు. పార్టీ కౌన్సిలర్లు, స్వతంత్ర సభ్యుడి మద్దతుతో ఆమెకు 13 ఓట్లు లభించగా ప్రత్యర్థి అభ్యర్థి వెనుకబడ్డారు.
పట్టణ రాజకీయాల్లో కొత్త సమీకరణలు

ఈ ఎన్నికల ఫలితాలతో నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీ ప్రభావం స్పష్టంగా కనిపించిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అధికార పగ్గాలు చేజిక్కించుకోవడంతో పట్టణ పాలనలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

Leave a Reply