క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ మార్చి 22 నుండి అభిమానులను అలరించనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో అమలు చేస్తున్న ఒక ముఖ్యమైన నియమంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
COVID-19 మహమ్మారి సమయంలో, ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బంతిపై లాలాజల వాడకాన్ని (సలైవా యూజ్) నిషేధించింది. ఈ నిషేధం ఐసీఎల్లో కూడా కొనసాగింది. అయితే, ఇప్పుడు BCCI అధికారికంగా బౌలర్లు బంతిపై తమ సలైవా రుద్దవచ్చని అధికారికంగా ప్రకటించింది.
నేడు ముంబయిలో ఐపీఎల్‌కు సంబంధించిన 10 జట్ల కెప్టెన్లు సమావేశమయ్యారు. ఈ చర్చల సందర్భంగా, చాలా మంది కెప్టెన్లు బంతిపై ఉమ్మివేయడంపై నిషేధాన్ని తొలగించాలని BCCIకి సూచించారు. BCCI కూడా ఈ మేరకు తక్షణ నిర్ణయం తీసుకుంది మరియు ఈ సీజన్ నుండి ఆ నియమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయం ముఖ్యంగా పేస్ బౌలర్లకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. సలైవా వాడకం బంతికి మెరుగైన స్వింగ్ ఇవ్వడమే కాకుండా రివర్స్ స్వింగ్‌కు కూడా సహాయపడుతుంది.