ఆలేరు వాసులకు రాష్ట్రస్థాయి అవార్డులు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన పసుపునూరి వీరేశం, సముద్రాల సత్యం ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని శనివారం త్యాగరాయ గానసభలో డిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అవార్డులను అందుకున్నారు. ప్రముఖ జ్యోతిష్య పండితులు దైవజ్ఞశర్మ చేతులమీదుగా ఈ అవార్డులను వారు స్వీకరించారు. సామాజిక సేవా రంగంలో వీరేశం, సత్యం అందిస్తున్న నిరంతర సేవలకు గాను ఈ రాష్ట్ర అవార్డులను అందజేసినట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర అవార్డులను అందుకున్న వారిద్దరికీ పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply