Avanigadda | తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్

Avanigadda | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్ అని, తెలుగు భాష పరిరక్షకుడు కృష్ణారావు అని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఆదివారం అవనిగడ్డ వంతెన సెంటరులో ఎంవీకే శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులు మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్, ఎంవీ కృష్ణారావు విగ్రహాలకు మండలి వెంకట్రామ్, కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం, మండలి అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, జనసేన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, టీడీపీ టౌన్ అధ్యక్షులు అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, పీఏసీఎస్ చైర్మన్లు యలవర్తి చిన్నా, మాదివాడ రత్నారావు, యర్రంశెట్టి సుబ్బారావు, రాజశేఖరస్వామి దేవస్థానం చైర్మన్ ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య), శ్రీలంకమ్మ అమ్మవారి ఆలయ చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, గాంధీ క్షేత్రం ప్రధాన కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ మండలి వెంకటేశ్వరరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మానేపల్లి కోటయ్య, గాంధేయవాది గరికపాటి సీతారామయ్య, ప్రముఖ న్యాయవాది బొప్పన వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు, దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర్, టీసీ అధ్యక్షుడు రేపల్లె రవీంద్ర, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, దేవస్థానం డైరెక్టర్లు మత్తి శివపార్వతి, అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, మాజీ డైరెక్టర్ విశ్వనాథ‌పల్లి పాప, కూటమి నాయకులు బండే రాఘవ, బచ్చు శ్రీహరి, డేగల రాఘవ, పులిగడ్డ బాలు శ్రీనివాస్, సిద్ధాబత్తుల హరినాధబాబు, అడపా వెంకటేశ్వరరావు, ముళ్లపూడి శ్రీను, ఆకుల సీతామహాలక్ష్మి, బాలమ్మ, చెన్ను గాంధీ, చెన్ను బాబూరావు, పుల్లగోరు రాజేంద్ర, మండలి రామ్మోహనరావు, భోగాది బాలకృష్ణ, లింగం బాబూరావు, గుగ్గిలం శ్యాంకుమార్, బడే సుబ్బారావు, షేక్ మొగల్ మురాద్ బేగ్, బాబావలీ, వాహేదుల్లా, గుడివాక నరహరి, బచ్చు ఆదినారాయణ, దామెర్ల సతీష్, యాసం శ్రీరాములు, మెగావత్ గోపి, మైలా హరిబాబు, కంచర్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply