Assam | ఉగ్ర‌దాడిని స‌మ‌ర్ధించిన ఎమ్మెల్యే అరెస్ట్ ..

గౌహ‌తి – జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌ను సమర్థించారనే ఆరోపణలపై అసోం పోలీసులు ప్రతిపక్ష ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేశారు . డింగ్ నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన ఇస్లాంను నాగావ్ జిల్లాలోని తన నివాసంలో అరెస్టు చేశారు. కాగా ఏఐయూడీఎఫ్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ ఆ అభిప్రాయాలు ఆయన సొంత అభిప్రాయాలే తప్ప పార్టీవి కావు అని పేర్కొంది.

“ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై థింగ్ ఎమ్మెల్యే ఇస్లాం చాలా తప్పుడు ప్రకటన” చేస్తున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోను పోలీసులు గమనించారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) స్వప్ననీల్ దేకా తెలిపారు. ఎమ్మెల్యే ఉగ్రవాదులను ఎలా సమర్థిస్తున్నారో గమనించిన అస్సాం పోలీసులు, తప్పుదారి పట్టించే, రెచ్చగొట్టే ప్రకటనలను వ్యాప్తి చేసినందుకు భారతీయ న్యాయ సంహితలోని 152, 196, 197(1), 113(3), 352, 353 సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేశామని, నేడు కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ తెలిపారు.

Leave a Reply