Asian Games | సుప్రీం కోర్టు గ్రీన్‌సిగ్నల్

Asian Games | సుప్రీం కోర్టు గ్రీన్‌సిగ్నల్
Asian Games | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : 2026 ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ పాల్గొనేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెటర్నిటీ బ్రేక్ (మాతృత్వం) తర్వాత ఆమె పాల్గొనకుండా డబ్ల్యూఎఫ్‌ఐ (WFI) విధించిన నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, ఆమెకు ఈ మేరకు భారీ ఊరట కల్పించింది. మే 30, 31 తేదీల్లో జరగనున్న ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో వినేష్ ఫోగాట్ పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మాతృత్వం అనేది ఎప్పుడూ వైకల్యం కాదని, కేవలం ప్రసవం/మాతృత్వ సెలవుల కారణంగా మహిళా అథ్లెట్లకు కెరీర్‌లో శిక్ష పడకూడదని న్యాయస్థానం అభిప్రాయపడింది. వినేష్ ఫోగాట్ ఫిట్‌నెస్‌పై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూనే, రెజ్లింగ్ ఫెడరేషన్ (WFI) అనుసరిస్తున్న ఎంపిక విధానంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
