చోరీ కేసులో ముగ్గురు బాలురు అరెస్ట్

చోరీ కేసులో ముగ్గురు బాలురు అరెస్ట్

ఉయ్యూరు – ఆంధ్రప్రభ : ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన చోరీ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న ఉయ్యూరు టౌన్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇవాళ మరో ముగ్గురు బాలురును అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. కేసు దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు మరియు ఇతర సమాచార ఆధారంగా ఈ ముగ్గురు బాలురి ప్రమేయాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న బాలురును జువెనైల్ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు బాలల సంరక్షణ గృహానికి తరలించడం జరిగింది. సందర్భంగా ఉయ్యూరు సీఐ శ్రీ టి.వి.వి. రామారావు మాట్లాడుతూ, ప్రస్తుత సమాజ పరిస్థితుల నేపథ్యంలో బాలురు సులభంగా చెడు వ్యసనాలకు గురై నేరాలకు పాల్పడే అవకాశాలు ఉన్నందున, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.

Leave a Reply