జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ నియామకం..
- 25 పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులుగా నియామకం..
- నంద్యాల జిల్లా పరిశీలకుడిగా మచిలీపట్నం ఎం. పి. బాలశౌరి నియామకం..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ సంస్థాగతపరంగా బలోపేతం చేయడానికి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 25 పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుగా నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నంద్యాల జిల్లాకు మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి ని నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల జిల్లా పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలైన శ్రీశైలం ఆళ్లగడ్డ బనగానిపల్లె నందికొట్కూరు పాణ్యం డోన్ నంద్యాల పరిధిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలను, వీర మహిళలను జనసైనికులను పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి పదవులు ఇచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.
నంద్యాల జిల్లా పార్లమెంటు నియోజకవర్గం లోని జన సైనికులు వీర మహిళల నుంచి నామినేటెడ్ పదవుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకుంటున్న వీర మహిళలు జనసైనికులు జనసేన పార్టీలో ఏ బాధ్యతలు స్వీకరించాలని చూస్తున్నారు నమోదు చేసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా సమన్వయకర్తలను నియమించనున్నారు. జిల్లా లోని పార్లమెంట్ నియోజకవర్గ పరిధి స్థాయిలోని అసెంబ్లీ నియోజకవర్గా ల తో సమావేశం ఏర్పాటు చేయాలి.ఈనెల 29వ తేదీ లోపల నియామకం పూర్తి చేయాలి. వచ్చిన దరఖాస్తులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతారు. కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారని జనసేన పార్టీ నాయకులు సుధాకర్ రవి లు తెలిపారు.
