ఏపీ పర్యాటకుల బస్సుకు తృటిలో ప్రమాదం..

ఏపీ పర్యాటకుల బస్సుకు తృటిలో ప్రమాదం..
- నరసరావుపేటకు చెందిన 50 మంది సురక్షితం
నరసరావుపేట, ఆంధ్రప్రభ : ఉత్తరప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకుల బస్సుకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సుమారు 50 మంది ప్రయాణికులు నైమిశారణ్యం దర్శించుకుని లక్నో, అయోధ్య మీదుగా నేపాల్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైనప్పటికీ, అదృష్టవశాత్తూ అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, అక్కడికక్కడే చికిత్స అందించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
