AP | మార్క్ శంకర్ పై అనుచిత పోస్టులు.. ఒక‌రి అరెస్ట్ !

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఇవాళ వెల్లడించారు. మార్క్ శంకర్ పై పెట్టిన పోస్ట్‌లపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

మార్క్ శంకర్ పై పోస్టులు పెట్టిన వ్యక్తిని కర్నూలు జిల్లాకు చెందిన పొట్టపాశం రఘు అలియాస్ పుష్పరాజ్‌గా గుర్తించినట్లు తెలిపారు. గతంలో మహిళలపై సైతం ఇతడు అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టాడని పోలీసులు గుర్తించారు. ఇలాంటి మొత్తం 37 పోస్టుల్ని తాము గుర్తించి డౌన్ లోడ్ చేసినట్లు వెల్లడించారు. వాటిపైనా కేసులు పెడతామన్నారు.

Leave a Reply