Ap-Ec-Sir-2026 : ఈసీ ఆన్ యాక్షన్ Andhra Prabha Top News
Ap-Ec-Sir-2026 : ఈసీ ఆన్ యాక్షన్ Andhra Prabha Top News
- ఎస్ ఐఆర్ సమస్యల పరిష్కారంపై ఫోకస్
- జిల్లా ఎన్నికల అధికారులతో భేటీ
- అభ్యంతరాలు.. క్లెయిమ్లపై విచారణ పురోగతిపై సమీక్ష
- ఓటర్ల జాబితాల ప్రచారజాత
- యువ ఓటర్ల నమోదుకు చైతన్యం
(ఆంధ్రప్రభ, అమరావతి )

Ap-Ec-Sir-2026 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, 2026 లో అభ్యంతరాలు, క్లెయిమ్ పై వేగంగా విచారణ జరిపి క్రమబద్దీకరిం,చాలని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు.
ఏపీ సచివాలయంలోని సీఈఓ కార్యాలయంలో ఏపీ అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్. దిల్లీ రావు తో కలిసి గురువారం ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR), 2026 క్లెయిమ్లు, అభ్యంతరాల పురోగతిపై సమీక్షించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓలు), అదనపు డీఈఓలు డిప్యూటీ డీఈఓలు పాల్గొన్నారు. వివిధ కార్యకలాపాల స్థితిని సీఈఓ సమీక్షించారు.

మ్యాపింగ్ చేయని ఓటర్లకు మ్యాపింగ్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని, నోటీసులను అందజేయాలని , ఎస్ఐఆర్, 2026 విచారణల పరిష్కారం, క్లెయిమ్లు అభ్యంతరాల పరిష్కారం, బీఎల్ఓఎస్ వద్ద పెండింగ్లోని ‘బుక్ ఎ కాల్స ఎన్జీఎస్పీపై అందిన ఇతర ఫిర్యాదులు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎస్ఐఆర్, 2026 కింద దాఖలైన క్లెయిమ్లు అభ్యంతరాల పరిష్కారాన్ని క్రమబద్ధీకరించాలని జిల్లాలకు సూచించారు.
ఓటర్లకు సౌకర్యం కల్పించేందుకు, రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో 2026 ఆగస్టు 22, 23, 29, 30 తేదీలలో ప్రత్యేక ప్రచారం నిర్వహించనున్నట్లు సీఈఓ తెలిపారు. ఈ నిర్దేశిత ప్రచారం రోజుల్లో ఓటర్ల జాబితా ధృవీకరణ, ఫారాలు, మార్గనిర్దేశం వంటి విషయాలలో పౌరులకు సహాయపడటానికి, రాజకీయ పార్టీల బూత్ స్థాయి అధికారులు (BLOS) బూత్ స్థాయి ఏజెంట్లు (BLAలు) అన్ని పోలింగ్ కేంద్రాలలో స్వయంగా హాజరవుతారు. ఎన్నికల నమోదు ప్రక్రియలు ఫారాల పంపిణీ అంతా క్షుణ్ణంగా, పారదర్శకంగా, చట్టబద్ధ మార్గదర్శకాలకు పూర్తిగా అనుగుణంగా నిర్వహించాలని ప్రధాన ఎన్నికల అధికారి పునరుద్ఘాటించారు.
యువ ఓటర్లను (18-19 సంవత్సరాల వయస్సు) నమోదు చేయడానికి విస్తృత ప్రచారం చేయాలని, కళాశాలలు/విద్యా సంస్థలలో శిబిరాలు నిర్వహించి వారి నమోదును చేపట్టాలని ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారులందరినీ ఎన్నికల సంఘం సీఈవో కోరారు.
