AP | ఆంధ్రప్రదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లా మారింది..

AP | ఆంధ్రప్రదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లా మారింది..

  • టీటీడీ లడ్డూలలొ జంతు అవశేషాలు కలవలేదని రెండు జాతీయ లేబరేటరీలు నిర్ధారించాయి
  • లడ్డు విషయంలో కూటమినాయకులు దోషులుగా తేలేరు
  • అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి దురదృష్టకరం
  • కేసులు కి దాడులకి భయపడే ప్రసక్తి లేదు
  • వైసీపీ యువజన విభాగం కృష్ణాజిల్లా అధ్యక్షుడు మెరుగుమాల ఖాళీ
  • గుడివాడ రాజేందర్ నగర్ లోని వైయస్సార్సీపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన నాయకులు

AP | గుడివాడ, ఆంధ్రప్రభ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదములో జంతు అవశేషాలు కలవలేదని చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా హిందూ బంధువులు హర్షం వ్యక్తం చేస్తుంటే చూడలేని కూటమి ప్రభుత్వ నాయకులు వైసిపి నాయకుల ఇళ్లపై మారణాయుధాలతో దాడులు చేస్తూ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మెడికల్ కాలేజీ లపై మాట్లాడినందుకు పేర్ని నాని, కల్తీ మద్యంపై మాట్లాడినందుకు జోగి రమేష్ , కల్తీ లడ్డు గురించి మాట్లాడుతున్నందుకు అంబటి రాంబాబులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.

వైసీపీ నాయకుల ఇళ్లపై ఆఫీసులపై దాడులు చేస్తుంటే పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి, గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు పాలేటి చంటి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జాన్ విక్టర్, కందుల నాగరాజు,అద్దేపల్లి పురుషోత్తం, ఎస్ కే బాజీ, గంట సురేష్, గుదే రవి, చుండూరు శేఖర్, కే ఎన్ ఎస్ వి ప్రసాద్, సమోసాల నాని, కరీముల్లా, అడప హర్ష, జ్యోతుల మణికంఠ, సురేఖ ,రమీజా, పుల్లేటికుర్తి కృష్ణారావు, పాగోలు రాఘవులు, జోషి, కలపాల కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply