పరుగు పందెంలో కారుమంచి సైనికుని ప్రతిభ

పరుగు పందెంలో కారుమంచి సైనికుని ప్రతిభ

శావల్యాపురం, ఆంధ్రప్రభ:

శావల్యాపురం మండలం కారుమంచి గ్రామానికి చెందిన ఇండియన్ ఆర్మీ జవాన్ పోలా అంకమ్మరావు అలియాస్ విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అవంతిక కంస్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 21 కిలోమీటర్ల పరుగుపందెంలో అత్యుత్తమ ప్రతిభ చూపి ప్రధమ స్థానం సాధించాడు. 21 కిలోమీటర్ల పరుగు పందాన్ని 1 గంట 24 నిమిషాల్లో పూర్తిచేసి మొదటి స్థానంలో నిలిచాడు.

అంకమ్మరావును అవంతిక కంస్ట్రక్షన్స్ ప్రతినిధులు ఘనంగా సత్కరించి 10 వేల నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం, మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా అంకమ్మరావు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చేస్తూ రన్నింగ్ పై ఆసక్తితో దేశంలో ఎక్కడ పోటీ జరిగినా అక్కడికి వెళ్లి పాల్గొంటున్నట్లు తెలిపారు. అంకమ్మరావును కుటుంబసభ్యులు బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్తులు అభినందించారు

Leave a Reply