​వినుకొండలో భారీ చోరీ

​వినుకొండలో భారీ చోరీ

వినుకొండ , ఆంధ్రప్రభ: పట్టణంలోని మెయిన్ బజార్లో ఇటీవల నూతనంగా ప్రారంభించిన బంగారం షాపులో భారీ చోరీ జరిగింది. షాపు మెట్ల మార్గంలో పైకి వెళ్లి కన్నం వేసి బంగారం వెండి పెద్ద ఎత్తున దొంగలించికెళ్లారు. సీసీ కెమెరాలు డివిఆర్ బాక్స్ లను కూడా ఎత్తుకెళ్లారు. పట్టణంలోని వీక్షిత జ్యువెలర్స్ అనే బంగారు షాపులో గురువారం అర్ధరాత్రి షాపు పక్కనున్న మెట్ల గేటును తెరచి షాపులో కన్నం వేసి దుండగులు పక్కా ప్లాన్‌తో ఈ దోపిడీకి పాల్పడ్డారు. షాపులో ఉన్న వెండి బంగారు ఆభరణాలను, నగదును దోచుకెళ్లారు. చోరీకి గురైన బంగారం, నగదు విలువ రూ. 20 లక్షల పైగా ఉంటుందని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

షాపులోపల డిజిటల్ వీడియో రికార్డు బాక్స్ ని, సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లారు. షాపులో పోలీస్ కుక్కలు పసికట్టకుండా కారం కూడా చలినట్లు పోలీసులు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే దొంగలు పక్కా పథకం ప్రకారం చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. పట్టణంలోని ప్రధాన గోల్డ్ షాపులో ఇలాంటి భారీ చోరీ జరగడంతో స్థానిక వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Leave a Reply