మందుబాబులకు షాకిచ్చిన తిరుపతి పోలీసులు

మందుబాబులకు షాకిచ్చిన తిరుపతి పోలీసులు

  • మద్యం సేవించి వాహనాలు నడిపిన 38 మందిపై కేసులు నమోదు
  • కోర్టు ఆదేశాలతో రూ.3.80 లక్షల జరిమానా విధింపు

తిరుపతి క్రైమ్, ఆంధ్రప్రభ: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా తిరుపతి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీఎస్పీ పర్యవేక్షణలో పట్టణ పరిధిలో ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 38 మంది వాహనదారులను గుర్తించి వారి పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. అదేవిధంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా వ్యవహరించిన మరో ముగ్గురిపై కూడా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుని కేసులు నమోదు చేశారు. వాహన తనిఖీల్లో పట్టుబడిన వారిని తిరుపతి 1వ స్పెషల్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ధనలక్ష్మి ఎదుట హాజరుపరచగా, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించిన 38 కేసులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.3.80 లక్షల జరిమానా విధించారు. అలాగే ట్రాఫిక్ అంతరాయానికి కారణమైన ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.300 చొప్పున మొత్తం రూ.900 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశాలు అధికంగా ఉంటాయని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తిరుపతి జిల్లా పోలీసులు సూచించారు.

Leave a Reply