ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్
- సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, ఆంధ్ర ప్రభ: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ అని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ప్రజల సమస్యల స్వీకరణ పరిష్కారాల కోసం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి వచ్చినటువంటి అర్జీలను తీసుకున్నారు.
నిత్యం తాము ప్రజల సమస్యల స్వీకరణ కొనసాగించడమే కాకుండా, ప్రతి శుక్రవారం నాడు ప్రత్యేకంగా ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు తీసుకుంటా ఉన్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, మాజీ కార్పొరేటర్లు, స్వర్ణాంధ్ర 2047 టీమ్,టీడీపీ నాయకులు పైడి శ్రీను,కంచేటి నాగరాజు, బుదాల సురేష్, లక్కీశెట్టి సాయి, సచివాలయ అడ్మిన్స్, తదితర అధికారులు,కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
