మైనార్టీ గురుకులంలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

మైనార్టీ గురుకులంలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

  • క‌ళాశాల ప్రిన్సిపాల్ పి.హేమ‌ల‌త‌

సంగారెడ్డి , ఆంధ్రప్రభ: సంగారెడ్డి పట్టణంలోని తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల-కళాశాల (టీజీఎంఆర్ఎస్ బాలికల-1)లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.హేమలత తెలిపారు. 5 నుంచి 6, 7, 8 తరగతులు, అలాగే ఇంటర్‌ మొదటి సంవత్సరం సీఈసీ, ఎంఈసీ గ్రూపులుల్లో ప్రవేశాలకు అవ‌కాశం ఉన్న‌ట్టు పేర్కొన్నారు.

5వ తరగతిలో మైనార్టీ విద్యార్థులకు 60, మైనార్టీయేత‌ర‌ విద్యార్థులకు 20 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 6, 7, 8 తరగతుల్లో కూడా మైనార్టీ విద్యార్థులకు ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో మైనార్టీ విద్యార్థులకు 30, మైనార్టీయేత‌ర‌ విద్యార్థులకు 10 సీట్లు కేటాయించార‌ని చెప్పారు. అర్హులైన విద్యార్థులు పాఠశాల, కళాశాల అడ్మిషన్ విభాగంలో దరఖాస్తులు అంద‌జేయాల‌ని సూచించారు.

దరఖాస్తులకు ఏప్రిల్ 30 చివ‌రి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే వారు ఆధార్, ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ, జనన ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఫోన్ నంబర్ సమర్పించాలని సూచించారు. అదనంగా టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్), బోనాఫైడ్ సర్టిఫికేట్ సమర్పించడం ద్వారా అడ్మిషన్‌ను నిర్ధారించుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 7331 170817 నంబర్‌లో లేదా అధికారిక వెబ్‌సైట్ tmreistelangana.cgg.gov.in ను సందర్శించవచ్చని ప్రిన్సిపాల్ సూచించారు.

Leave a Reply