టిటిడి చైర్మన్ పదవి నుంచి తక్షణమే తొలగించాలి..

టిటిడి చైర్మన్ పదవి నుంచి తక్షణమే తొలగించాలి..

డాక్టర్ గోపిరెడ్డి డిమాండ్

నరసరావుపేట, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్* పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని స్థానిక బరంపేట లోని శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి 101 కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం గోపిరెడ్డి నివాసం నుండి బరంపేటలో వేంచేసియున్న శ్రీలీలా వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం వరకు గోపిరెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు.టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు ని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని స్వామివారిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…

పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బి ఆర్ నాయుడు నియమితులైన తర్వాత వరుసగా అపవిత్ర సంఘటనలు జరుగుతున్నాయని గోపిరెడ్డి అన్నారు. 30 ఏళ్ల నుంచి ఒక భార్య కాని మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని టీటీడీ చైర్మన్గా ఏ విధంగా కొనసాగించారని కూటమిప్రభుత్వాన్ని ప్రశ్నించారు ?
ఇది చాలా తప్పుడు సాంప్రదాయమని ,ఇటువంటి వ్యక్తిని నియమించటం వల్ల వరుసగా దేవస్థానం అపవిత్రమవుతుందని, పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలంటే తక్షణమే బిఆర్ నాయుడుని తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

బిఆర్ నాయుడు లాంటి అపవిత్ర వ్యక్తులకు పవిత్రమైన టిటిడి చైర్మన్ స్థానంలో కూర్చోవడానికి అర్హత లేదని, దేవస్థానం మలినం అవుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొన్న వారి మనవడి పుట్టినరోజు వేడుకలకు తిరుపతి వెళ్ళినప్పుడు బిఆర్ నాయుడుని వెంటబెట్టుకొని దేవస్థానం క్యూలైన్లు, పరిసర ప్రాంతాలన్నీ వి ఆర్ నాయుడు ను వెంటబెట్టుకుని తిరిగారని దాని వల్ల ఆయనకు కూడా చెడ్డ పేరు వస్తుందని ,దేవస్థానం పవిత్రతను మంట కలిపిన బిఆర్ నాయుడుని తక్షణమే టిటిడి చైర్మన్ పదవి నుంచి తొలగించి, ఎటువంటి దురలవాట్లు లేని, దేవస్థానం పవిత్రత కాపాడే మంచి వ్యక్తిని ఈ పదవిలో నియమించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply