పారిశుద్ధ్యం మెరుగుదలకు సహకరించాలి..

పారిశుద్ధ్యం మెరుగుదలకు సహకరించాలి..
శావల్యాపురం, ఆంధ్రప్రభ : పారిశుద్ధ్య మెరుగుదలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీవో సీతారామయ్య అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం శావల్యాపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద అధికారులతో కలిసి ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజల సహకారంతో పారిశుధ్యం మెరుగుపరచి ప్రతి గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దాలని, స్వర్ణాంధ్ర సాకారానికి సమిష్టిగా కృషి చేయాలన్నారు. మండల సచివాలయాధికారి ఆంజనేయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
