జాతీయ రహదారికి మరమ్మతులు

జాతీయ రహదారికి మరమ్మతులు

  • ఆంధ్రప్రభ ఎఫెక్ట్ ….
  • ఆంధ్రప్రభ కథనానికి స్పందించిన అధికారులు

తొర్రూరు, ఆంధ్రప్రభ : వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి మరమ్మత్తు పనులు నత్త నడకన సాగడంపై గురువారం జాతీయ రహదారిపై రుధిర ధారలు పేరిట ఆంధ్ర ప్రభ దినపత్రికలో కథనం వెలువడింది. కథనానికి స్పందించిన జాతీయ రహదారి అభివృద్ధి సంస్థ అధికారులు మరమ్మత్తు పనులు వేగవంతం చేశారు.

వెలికట్ట గ్రామ శివారు లో మూడు కిలోమీటర్ల మేర రహదారి నిర్వహణ పనులలో భాగంగా రోడ్డు మిల్లింగ్ పేరిట పై పొరను తొలగించడంతో రహదారి ఎగుడుదిగుడుగా మారి వాహనదారులు కిందపడి గాయాల పాలయ్యారు. సుమారు 50 మంది వరకు గాయాలపాలై ఇబ్బందుల పాలయ్యారు. పదిమంది వరకు ప్రాణాపాయ స్థితికి వెళ్లారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వేలల్లో సమర్పించుకున్నారు.


మరమ్మత్తు పనులు నత్తనడకన సాగడంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గుర్తించిన ఆంధ్ర ప్రభ దినపత్రిక దానిపై కథనం వెలువరించి ప్రజల దృష్టికి తీసుకెళ్లింది.అధికారులు స్పందించి వేగవంతంగా తారు వేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆంధ్రప్రభ పత్రికకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply