కష్టకాలంలో ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం:ఎమ్మెల్యే రాము

గుడివాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కష్ట కాలంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా సహాయం అందిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి శ్రమిస్తున్న చంద్రబాబు కష్టాన్ని ప్రజలందరూ గుర్తించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని ప్రజా వేదిక కార్యాలయంలో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో కూటమి నాయకత్వం సమక్షంలో నియోజకవర్గ పరిధిలోని 36 బాధిత కుటుంబాలకు మంజూరైన రూ.23.40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, “కష్టకాలంలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. సీఎం చంద్రబాబు బాధితుల కన్నీళ్లు తుడిచేందుకు సీఎంఆర్ఎఫ్‌ను అత్యంత పారదర్శకంగా అందిస్తున్నారనీ ఉద్ఘాటించారు. గత రెండేళ్లలో గుడివాడ నియోజకవర్గానికే రూ.6.59 కోట్ల సహాయనిధి మంజూరు అయిందని చెప్పారు.ఇది నా ఒక్కడి కృషి కాదనీ.. ప్రజల ఆశీస్సులు, కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని ఎమ్మెల్యే రాము పునరుద్గాటించారు.

“రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారనీ, ఆయన తపన, త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల మంచి కోసం పనిచేసే ఈ ప్రభుత్వానికి అందరూ మద్దతుగా నిలవాలి” అని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు తెలిపారు.

కూటమి నాయకులు మాట్లాడుతూ, “ఎమ్మెల్యే రాము కృషి వల్లే రాష్ట్రంలోనే అత్యధికంగా గుడివాడకు సీఎంఆర్ఎఫ్ నిధులు వస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదనీ,గుడివాడ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే రాముకు ప్రజలు అండగా ఉండాలనీ నాయకులు పిలుపునిచ్చారు.

ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్లు చాట్రగడ్డ రవికుమార్, పొట్లూరి రవి, గుడివాడ, నందివాడ మండలాల టిడిపి అధ్యక్షులు పండ్రాజు సాంబయ్య, దానేటి సన్యాసిరావు , కార్పొరేషన్ డైరెక్టర్లు మజ్జాడ నాగరాజు, గోకవరపు సునీల్, టిడిపి నాయకులు యార్లగడ్డ సుధారాణి, గుత్తా చంటి, చేకూరు జగన్మోహన్రావు, కోడూరి ప్రభు, అడుసుమిలి శ్రీనివాస్, సింగాల రాధాకృష్ణ, బొంబాయి శ్రీను, వంగపండు ఆదినారాయణ, అంగుళూరు రాజు, రంగబాబు తదితర కూటమి నేతలు, పార్టీ శ్రేణులు, చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.