కళాకారులు పాత్రలకు జీవం పోస్తున్నారు..

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రశంస
మహా పురుషుడు మండలి నాటక కళాకారులకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సత్కారం

అవనిగడ్డ – ఆంధ్రప్రభ : మహా పురుషుడు మండలి నాటక కళాకారులు ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు జీవం పోస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రశంసించారు. సోమవారం ఉదయం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో తాడేపల్లి అరవింద ఆర్ట్స్ నిర్వాహకుడు, మండలి వెంకట కృష్ణారావు పాత్రధారి, దర్శకుడు గంగోత్రి సాయిని, వారి బృందంలోని కళాకారులను, లైటింగ్, సెట్టింగ్స్, సౌండ్, డిజిటల్ టెక్నీషియన్లను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఘనంగా సత్కరించారు. ప్రతి ప్రదర్శనలోనూ అద్భుతమైన నటనతో ప్రతి ఒక్క కళాకారుడూ ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్నారని, హృదయాలను ద్రవింపచేసేలా నటించి మెప్పిస్తున్న ప్రతి ఒక్క కళాకారుని నటన ప్రేక్షకులను రెండు గంటల పాటు కట్టిపడేసే స్థాయిలో ఉండటం కళాకారుల ప్రతిభకు నిదర్శనం అన్నారు.