Adluri Laxman Kumar | కేటీఆర్‌కు వ్యవసాయంపై అవగాహన లేదు
2029లో మళ్లీ కాంగ్రెస్‌దే విజయం
Adluri Laxman Kumar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం కమిషన్ల కోసమే నిర్మించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అమెరికా నుంచి వచ్చి తండ్రి వల్ల ప్రజాప్రతినిధిగా ఎదిగిన కేటీఆర్‌కు వ్యవసాయంపై కనీస అవగాహన లేదని మంత్రి వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలు, సాగునీటి అవసరాలపై అవగాహన లేకుండానే విమర్శలు చేస్తున్నారన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని, అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
రానున్న 2029 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
