Husband Murder | వివాహేతర సంబంధం కోసం ఘాతుకం..

Husband Murder | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నిజామాబాద్ శివారులో భర్త హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే అనుమానంతో భార్య అత్యంత దారుణంగా హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

పోలీసుల వివరాల ప్రకారం.. ప్రశాంత్‌కు ముందుగా మద్యం తాగించిన భార్య సంధ్య, అనంతరం అతడిని కిందకు తోసేసినట్లు తెలుస్తోంది. అయితే అతడు ప్రాణాలతో ఉండటాన్ని గమనించిన ఆమె, టాయిలెట్ క్లీనర్‌గా ఉపయోగించే హార్పిక్ ద్రావణాన్ని నరాల్లోకి ఎక్కించి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, సేకరించిన ఆధారాల ఆధారంగా నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.