Accident | కారు ప్రమాదంలో స్టార్ హీరో….

Accident | కారు ప్రమాదంలో స్టార్ హీరో….
తమిళ స్టార్ హీరో ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైన శివకార్తికేయన్ ప్రయాణిస్తున్న కారు చెన్నై నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన సెంట్రల్ కైలాష్ వద్ద యాక్సిడెంట్ కు గురైంది. శివకార్తికేయన్ ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటన సమయంలో కారులో శివకార్తికేయన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు కారు కొంత మేరకు ధ్వంసమైనప్పటికీ, అదృష్టవశాత్తూ శివకార్తికేయన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక, ఇటీవలే మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘అమరన్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న శివకార్తికేయన్, ప్రస్తుతం తన కెరీర్‌లో మైలురాయిగా భావిస్తున్న 25వ చిత్రం ‘పరాశక్తి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం 2026 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
