వ్యవసాయ బావిలో ప్రమాదం.. ఒకరి మృతి

పాలకుర్తి, ఆంధ్రప్రభ : పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో వ్వవసాయ బావి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కరు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. బావిలో పనులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.
