Aamani | బీజేపీలో చేరిన న‌టి ఆమ‌ని..

Aamani | బీజేపీలో చేరిన న‌టి ఆమ‌ని..

Aamani | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ (Telangana) బీజేపీలో సినీ గ్లామర్ మరోసారి చర్చనీయాంశమైంది. నాటి ప్రముఖ స్టార్ హీరోయిన్ ఆమని శుక్రవారం బీజేపీలో చేరారు. నాంపల్లిలోని బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ((Ramchander Rao) ఆమనికి పార్టీ కండువా కప్పి, సభ్యత్వ కార్డు అందజేసి పార్టీలోకి ఆహ్వానించారు.

90ల దశకంలో తెలుగు సినిమారంగంలో స్టార్ హీరోయిన్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న ఆమని చేరికతో తెలంగాణ బీజేపీ (Telangana BJP) లో సినీ గ్లామర్ మరింత పెరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆమని (Amani) చేరిక పార్టీకి బలం చేకూర్చుతుందని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీలో ఇటీవల సినీ నటులు, నటీమణుల చేరికలు పెరుగుతున్న నేపథ్యంలో ఆమని జాయినింగ్ మరింత ఆసక్తి రేపింది.