Hospital | అప్ప‌టి క‌రువు మంత్రి ఇక‌లేరు…

Hospital | అప్ప‌టి క‌రువు మంత్రి ఇక‌లేరు…

  • శోకమయమైన అరసవల్లి..
  • గొప్ప నాయకున్ని కోల్పోయిన టీడీపీ
  • సంతాపాల వెల్లువ… రేపు అంత్యక్రియలు..

Hospital | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికైన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు ఆయన భార్య గుండ లక్ష్మీదేవి 2014 నుంచి 19 వరకు శాసనసభ్యురాలుగా ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆయన తన నివాస గృహంలోని బాత్రూంలో అప్పలసూర్యనారాయణ జారిపడటం తో అయన తలకు బలమైన గాయం కావడంత అతన్ని వెంటనే శ్రీకాకుళం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రి(Private hospital)లో చేర్పించారు.

వెంటిలేట‌ర్‌ పై ఆయనను ఉంచి బ్రతికించేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మరణించడంతో అరసవిల్లి ప్రాంతం లో విషాదం అలముకుంది. గుండ అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు ఆయనకు ఇద్దరు కుమారులు శివగంగాధర్, విశ్వనాధ్ ఉన్నారు. వీరిద్దరూ అమెరికాలో ఒకరు వైద్యులు గాను, మరొకరు ప్రొఫెసర్ గా ఉన్నారు. సోమవారం రాత్రి 12 గంటలకు కుమారులు ఇద్దరు అరసవిల్లికి చేరుకోవచ్చునని భావిస్తున్నారు.

మంగళవారం అప్పల సూర్యనారాయణకు అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను గుండ అప్పల సూర్యనారాయణ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. నాలుగు దశాబ్దాల(decades)కు పైగా రాజకీయాల్లో ఉంటూ వచ్చిన ఆయనపై ఇంతవరకు ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఎవరు చేయలేకపోయారు నిస్వార్ధంగా ఆయన పదవులు నిర్వహించడమే కాకుండా పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారు.

1985 ఎన్నికల్లో తొలిసారిగా ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీకాకుళం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తరువాత వరుసగా 1989 1994 1999 ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు 1989 లో గెలిచిన తర్వాత ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆయన కొంతకాలం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎథిక్స్(assembly ethics) కమిటీ చైర్మన్ గా పదవి నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కూడా దశాబ్దకాలం గుండ అప్పలసూర్యనారాయణ పదవి నిర్వహించారు.

జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పట్టణంలోని బలగ ప్రాంతంలో 89 తర్వాత కొంత స్థలాన్ని కొనుగోలు చేసి ఆ తర్వాత 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నేపద్యంలో బలగలోకొన్న స్థలాన్ని అమ్మి ఆ డబ్బుతో పట్టణంలోని 80 అడుగుల రోడ్డు ప్రక్కన భారీ స్థాయిలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం సాగించిన గుండ అప్పలసూర్యనారాయణ చనిపోయిన వార్త నియోజవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆయన స్వగృహానికి వెళ్లి గుండ తో తమకు ఉన్న అనుభవాలను నెమరు వేసుకుంటూ విలపిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుని సంతాపం..మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మృతి పట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మొదలవలస రమేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జిల్లాలో నిబద్ధత గల రాజకీయ నాయకునిగా నిజాయితీకి మారుపేరుగా అప్పలసూర్య నారాయణ తన రాజకీయ జీవితాన్ని కొనసాగించి ఆదర్శంగా నిలిచారని, అటువంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టమని అన్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ ఆదేశాలను దిక్కరించకుండా, పార్టీ నిబంధనలను దాటకుండా, గుండ తెలుగుదేశం నాయకునిగా ఉంటూ వచ్చారని, ఆయన మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని తెలియజేస్తూ అప్పలస్వామి నా కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలియజేశారు.

Leave a Reply