Smart phone | స్మార్ట్ ఫోన్ కాదు…స్మార్ట్ మనస్సు ఉండాలి

Smart phone | స్మార్ట్ ఫోన్ కాదు…స్మార్ట్ మనస్సు ఉండాలి

  • వైఫై కాదు… విల్ పవర్ పెంచుకోండి
  • బలహీనతలను విడిచిపెట్టడండి
  • స్వామి వివేకానందుడి స్పూర్తితో దేశం కోసం పనిచేయండి*
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు

Smart phone | కరీంనగర్, ఆంధ్రప్రభ : మీరంతా స్మార్ట్ ఫోన్(Smart phone)లకే పరిమితం కావొద్దు. స్మార్ట్ మనస్సును తయారు చేసుకోవాలని.. వైఫై కాదు… విల్ పవర్ పెంచుకోండని…ప్రశ్నించే ధైర్యాన్ని నింపుకోండని …అన్యాయం జరిగితే ఎదిరించే శక్తి పెంచుకోవాలని…. మీ కోసం, మీ కుటుంబం కోసం కాకుండా దేశం కోసం పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ యువతకు పిలుపునిచ్చారు. భారత దేశ ఖ్యాతిని ఖండాంతారాలు దాటించడమే కాకుండా భారతీయ సమాజాన్ని జాగృతం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని, నిరాశలో ఉన్న యువతను తట్టి లేపేందుకు ఆయన చెప్పే మాటలు యువతకు తారక మంత్రంగా పనిచేస్తాయని అన్నారు.

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మేరా యువ భారత్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతిలో జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయి పలువురికి స్పోర్ట్స్ కిట్స్(sports kits) అందజేశారు. అనంతరం మాట్లాడుతూ… భారత దేశ ఖ్యాతిని ఖండాంతారాలు దాటించిన వ్యక్తి. భారతీయ సమాజాన్ని జాగృతం చెయ్యడమే కాకుండా యోగ, వేదాంత శాస్త్రాలను ప్రపంచ వ్యాప్తం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అన్నారు.

Smart phone |

నిరాశలో ఉన్న యువతను తట్టి లేపేందుకు ఆయన చెప్పే మాటలు మనకు ఎప్పటికీ తారక మంత్రంగా పనిచేస్తాయన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పమున్న యువతను 100 మందిని ఇవ్వండని ఈ దేశ తలరాతనే మార్చేస్తానంటూ స్వామి వివేకానంద చెప్పిన మాటలను చూస్తే భారతీయ యువత శక్తి సామర్ధ్యాల మీద ఆయనకు ఎంత గట్టి నమ్మకం ఉందో అర్ధం చేసుకోవాలన్నారు.

కానీ ఈ రోజు యువత పరిస్థితి బాధాకరమని చేతిలో మొబైల్, ఇంటర్నేట్, ఆన్ లైన్ గేమ్స్… మద్యం, డ్రగ్స్ కు బానిసలవుతున్నారన్నారు. విదేశాలన్నీ భారత్ ను ఫాలో అవుతుంటే మనం మాత్రం మోడరన్ కల్చర్ పేరుతో విదేశీ కల్చర్ ను అలవాటు చేసుకుంటున్నామన్నారు.

Leave a Reply