PACS CEO | నూతన సీఈఓగా ఆశన్న బాధ్యతల స్వీకరణ

PACS CEO | నూతన సీఈఓగా ఆశన్న బాధ్యతల స్వీకరణ
PACS CEO | కడెం (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లాలో ఇటీవల ప్రాథమిక సహకార సంఘాల సీఈఓల బదిలీలు కావడం జరిగింది. ఇందులో భాగంగా కడెం మండలంలోని పాండవపూర్ పీఏసీఎస్ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న కాసుల రాజేందర్ మామడ పీఏసీఎస్ సీఈఓ(PACS CEO)గా బదిలీ కాగా ఆయన స్థానంలో ఖానాపూర్ పీఏసీఎస్ సొసైటీలో సీఈఓగా విధులు నిర్వహిస్తున్న బీ. ఆశన్నఈ రోజు పాండవపూర్ పీఏసీఎస్ సీఈఓగా పదవి బాధ్యతలు స్వీకరించారు.
కడెం ఏడీసీసీ బ్యాంక్ మేనేజర్ రాజేశ్వరరావు, పాండవపూర్ పీఏసీఎస్ ఉద్యోగులు, సిబ్బంది, నూతన సీఈఓ గా వచ్చిన ఆశన్నకు శాలువలు కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
