Minister | ఐఏఎస్ ల పై ఆరోపణలు సిగ్గుచేటు

Minister | ఐఏఎస్ ల పై ఆరోపణలు సిగ్గుచేటు

  • రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తున్న వారిపై నిందలా
  • పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

Minister | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులపై అసత్యపు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలియజేశారు. ఇవాళ‌ పెద్దపల్లి జిల్లా మంథని పర్యటనలో భాగంగా మాట్లాడుతూ… ఐఏఎస్ అధికారులు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారని, అటువంటి వారిపై నిందలు వేయడం సరికాదన్నారు.

రాజకీయ లబ్ధి కోసం అధికారులపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదని, అటువంటి ఆరోప‌ణ‌లు చేయడంతో పాటు ప్రసారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

రాజకీయంగా ఏమైనా ఉంటే రాజకీయపరంగానే ముందుకు తీసుకువెళ్లాలి.. తప్ప వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజకీయ నేతలు, అధికారులపై అసత్య ప్రచారాలు వైరల్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

Leave a Reply