YouTube | నిజాన్ని నిర్భయంగా ప్రచురించే దినపత్రిక ఆంధ్రప్రభ

YouTube | నిజాన్ని నిర్భయంగా ప్రచురించే దినపత్రిక ఆంధ్రప్రభ

  • మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్

YouTube | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వార్తలు నిజాన్ని నిర్భయంగా ప్రచురించే దినపత్రిక ఆంధ్రప్రభ అని వరంగల్ తొలి మేయర్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. ఈ రోజు నరేందర్ క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రభ(Andhraprabha) దినపత్రిక 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ… ఆంధ్రప్రభ 88 ఏళ్ల చరిత్ర కలిగిన గొప్ప పత్రిక అని యూ ట్యూబ్ సోషల్ మీడియా, స్మార్ట్ ఎడిషన్ రంగాలలో శరవేగంగా దూసుకుపోతుందని నరేందర్ అన్నారు. నిజాన్ని నిర్భయంగా ప్రచురించే పత్రిక అని పాఠకుల మనసు దోచుకొని తాజా వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తున్నదని అన్నారు. యూట్యూబ్(YouTube) రంగంలో శరవేగంగా ఆంధ్రప్రభ దూసుకుపోతుందని స్మార్ట్ ఎడిషన్ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుందని నరేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సై సంజీవరావు, మాజీ కూడా డైరెక్టర్ మోడం ప్రవీణ్, బజ్జూరి రవి, మాత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు ముద్దసాని మల్లిక, కొత్తగట్టు కళ, బత్తిని రజని సంస్థసభ్యులు పాల్గొన్నారు.