70 people | ఉచిత కంటి వైద్య పరీక్షలు

70 people | నాగాయలంక, ఆంధ్రప్రభ : పెద కాకాని శంకరా కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఈ రోజు స్థానిక మారుతీ విద్యా నికేతన్ స్కూల్ లో నిర్వహించారు. కీర్తి శేషులు తలశిల శ్రీరాములు, ఉప్పల వెంకయ్య, కనిగంటి అంకినీడు ఆర్ధిక సౌజన్యాలతో ఈ వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ శిబిరంలో కంటి వైద్యులు వందన 70మందికి కంటి పరీక్షలు చేసి అందులో40 మందికి ఆపరేషన్ కోసం ఎంపిక చేశారు. కంటి రోగులను ఆపరేషన్ కోసం బస్సులలో ఆసుపత్రికి పంపించినట్లు తలశిల రఘుశేఖర్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో క్యాంప్ ఇంచార్జినాగబాబు, సిబ్బంది, కనిగంటి నారాయణ పాల్గొని పర్యవేక్షించారు.