Electricity | సమస్యల పరిష్కారానికి ప్రజాబాట

Electricity | సమస్యల పరిష్కారానికి ప్రజాబాట

  • 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్

Electricity | ఖిలావరంగల్, ఆంధ్రప్రభ : విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రజాబాట కార్యక్రమం నగరంలోని 37వ డివిజన్ తూర్పు కోటలో ఏఈ రామకృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈసందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… దీర్ఘకాలంగా పరిష్కారం కాని విద్యుత్ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం, ఎన్పీడిసియల్ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ముఖ్యంగా వేలాడే కరెంట్ తీగలు, షిఫ్టింగ్ పోల్స్, ట్రాన్స్ఫారం, కరెంట్ వైర్ల పైన చెట్లు మొదలైన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారని తెలిపారు. వాడుకలో లేని స్థంబాలను తొలగించడం, సమస్యగా ఉన్న స్థంబాలను సరిచేస్తూ ప్రజలకు సేవలు చేస్తున్నందుకు విద్యుత్ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏడిఈ కిషోర్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు బోయిని దూడయ్య, నాయకులు బెడద వీరన్న, శంభుని గుడి ధర్మకర్త సిరబోయిన గిరి, లైన్ ఇన్స్పెక్టర్లు రాజయ్య, ఆదామ్, సాంబరాజు, లైన్ మెన్లు నాగరాజు, శ్రీనివాస్, శ్రీధర్, జూనియర్ లైన్ మెన్లు మురళి, అనిల్, యూఎంఎస్ లు నవీన్, రాజేష్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply