Police |జనగామ చౌరస్తాలో ఉద్రిక్తత…

Police |జనగామ చౌరస్తాలో ఉద్రిక్తత…
Police |వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని జనగామ ఆర్టీసీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు.
రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ నిరసనను పోలీసులు(police) అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఓ కాంగ్రెస్ నాయకుడి తలకు గాయాలయ్యాయి. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని పీఎస్ కు తరలించారు.
