Minister | దుర్గామల్లేశ్వర స్వామిని దర్శించుకున్న బండి సంజయ్

Minister | దుర్గామల్లేశ్వర స్వామిని దర్శించుకున్న బండి సంజయ్
Minister | హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Minister Bandi Sanjay Kumar) ఇవాళ హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్నారు. నగరంలోని పంజాగుట్టలో ఉన్న శ్రీదుర్గా భవాని ఆయలంలో కొలువైన దుర్గామల్లేశ్వర స్వామిని బండి సంజయ్ దర్శించుకున్నారు.
ఈసందర్భంగా ప్రధాని మోదీ గోత్రనామాలతో ఆయన అర్చన చేయించారు. ఆలయ పూజారి ప్రత్యేక అర్చన, పూజ చేశారు. కేంద్ర మంత్రి సంజయ్కు ఆలయ కమిటీ స్వాగతం(welcome) పలికింది. ఆలయంలో కొలువైన దుర్గాభవాని అమ్మవారు, మేధా దక్షిణామూర్తి స్వామిని కూడా ఆయన దర్శించుకుని పూజలు చేశారు. కేంద్ర మంత్రిని పూలమాల, శాలువాతో ఆలయ కమిటీ సత్కరించింది. సుమారు 15 నిమిషాల పాటు శ్రీదుర్గాభవాని ఆలయంలో కేంద్ర మంత్రి గడిపారు.

