AP CM with Farmer  మోసం లేదు Andhra Prabha Live News

AP CM with Farmer  మోసం లేదు Andhra Prabha Live News

గత పాలకుల దగా

మీ భూముల్ని కాజేసే కుట్ర జరిగింది

తెరమీదకు గట్టు గొడవలు రావు

 జాగ్రత్తగా అన్ని రికార్డులు సిద్ధం చేశాం

రాయవరం ప్రజావేదికపై  సీఎం చంద్రబాబు

( ఆంధ్రప్రభ, రాయవరం )

AP CM with Farmer

ఎక్కడా మోసం జరక్కుండా, వివాదాలకు తావివ్వకుండా రాజముద్రతో మీ భూమి- మీహక్కు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం, పద్దతి ప్రకారం రీసర్వే చేయించి.. రికార్డులు అన్నీ అత్యంత సురక్షితంగా ట్యాంపర్ చేయలేని విధంగా భద్రపరుస్తున్నాం, భూ రికార్డులు ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చెయిన్ టెక్నాలజిని వినియోగిస్తున్నాం.

AP CM with Farmer

జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మీ రికార్డు వచ్చేస్తుంది, అని (Ap Cm Chandra Babu) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా   మండపేట నియోజకవర్గం రాయవరం (Rayavaram) లో మీ భూమి- మీ హక్కు పట్టాదారు (Mee Bhumi Mee Hakku)  పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను

AP CM with Farmer

రాయవరం రైతులకు  సీఎం చంద్రబాబు అందజేశారు. ఆ పాస్ పుస్తకాలపై ముద్రించిన క్యూఆర్ కోడ్, సాంకేతికతను స్వయంగా   ముఖ్యమంత్రి పరిశీలించారు.  రైతులు, భూ యజమానులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ పెట్టాలని   సీఎం సూచించారు.

AP CM with Farmer  :  అన్నీ  గత పాలకుల అక్రమాలే

AP CM with Farmer

అనంతరం మీ భూమి- మీ హక్కు ప్రజావేదిక నుంచి  ముఖ్యమంత్రి  మాట్లాడుతూ,  పూర్వీకుల నుంచి సంక్రమించిన, స్వార్జిత  భూమితో రైతులకు తెగని  అనుబంధం ఉంటుంది అన్నారు.  కరోనా సమయంలో అంతా సెలవు తీసుకున్నారు. కానీ అందరికీ అన్నం పెట్టే రైతన్నకు సెలవే లేదు. గత పాలకులు పాస్ పుస్తకాల జారీ విషయంలో అస్తవ్యస్తంగా అక్రమాలు చేశారు, అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

AP CM with Farmer : మీ భూముల్నీ కాజేసే కుట్ర పన్నారు

AP CM with Farmer

గత పాలకుల్ని, ప్రభుత్వాన్ని హెచ్చరించాను. కానీ వారి అహంకారం నెత్తికెక్కి మీ ఆస్తులపై ఆయన ఫోటో వేసుకున్నారు, మన పూర్వీకులు ఆర్జించిన భూమిపై ఆయన ఫోటో ఏమిటి.? సరిహద్దు రాళ్లపై ఆయన ముద్రలేమిటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ ఓ చట్టాన్ని తెచ్చి ఆయనకు నచ్చిన వాళ్ల ఆధీనంలోకి తీసుకువచ్చేలా చేశారు. దీనిని గతంలోనే తీవ్రంగా వ్యతిరేకించాను.  మీ భూముల వివరాలన్నీ గత పాలకుల అనుచరులు అమెరికాలో పెట్టుకున్నారు. కూటమి అధికారంలోకి రాకపోతే ఈ భూములన్నీ కాజేసేందుకు కుట్రపన్నారు. అని సీఎం వివరించారు.

AP CM with Farmer : మీరే తగిన శాస్తి చేశారు

AP CM with Farmer

నిన్నా మొన్నా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు చాలా ప్రమాదకరమైన ఆలోచన చేశారు . మీ భూమి మీ హక్కు వాటి పై వేరేవాళ్ల ఫోటోలెందుకని ప్రశ్నించాను. గత పాలకులు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ రెండో సంతకమే పెట్టాను. భూమి అనేది రైతుకు ఆస్తిమాత్రమే కాదు ఓ విశ్వాసం, కుటుంబంతో కలిసిపోయిన సెంటిమెంట్. గతంలో భూమి ఇవ్వకపోతే దానిని 22 ఏ  రికార్డుల్లో పెట్టేశారు. అందుకే ప్రజలు ఆలోచించి సమయం వచ్చినప్పుడు చూద్దామని బ్యాలెట్ ద్వారా తగిన బుద్ధి చెప్పారు, అని సీఎం అన్నారు.

AP CM with Farmer : తెలంగాణ మాదిరే,.. అన్నీ తగువులే

AP CM with Farmer

రాజముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. ఏపీ ప్రాంతంలో ఉన్న రికార్డులు అన్నీ పక్కాగా ఉన్నాయి. తెలంగాణా ప్రాంతంలో ఎక్కువ భూవివాదాలే. మున్సబు, కరణాల వ్యవస్థను రద్దు చేసి ఎన్టీఆర్ రైతులకు, భూ యజమానులకు మేలు చేశారు ఈ వ్యవస్థ రద్దైనప్పుడు తెలంగాణాలో పండుగ చేసుకున్నారు, సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.  గత పాలకుల తీరు కారణంగా ఎక్కడకు వెళ్లినా భూ వివాదాలకు సంబంధించిన పిటిషన్లే వస్తున్నాయి. ఈ వివాదాలను పరిష్కరించేందుకు సంకల్పించి మీ వద్దకు వచ్చాను. తహసీల్దారు కార్యాలయంలో కాదు..గ్రామసభలు నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించాను, అని సీఎం వివరించారు.

ALSO READ : Pawan Dance :  వావ్​.. పీఠికాపురి Andhraprabha Live

Leave a Reply