CM Cup | యువ చైతన్యం కోసమే సీఎం కప్ -2026 టార్చ్ ర్యాలీ

CM Cup | యువ చైతన్యం కోసమే సీఎం కప్ -2026 టార్చ్ ర్యాలీ

CM Cup | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : యువతలో చైతన్యం నింపి, క్రీడల్లో రాణించే ఆరోగ్య సమాజం కోసమే సీఎం కప్ -2026 టార్చ్ ర్యాలీ లక్ష్యమని అని తహసీల్దార్ దిలీప్ కుమార్ అన్నారు. గురువారం జడ్పీ ఉన్నత బాలికల పాఠశాల నుంచి ర్యాలీ తీశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల యువతకు సమాన అవకాశాలు కల్పించి, క్రీడల ద్వారా ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన సమాజాన్ని నిర్మించడమే ప్రధాన ఉద్దేశ్యంగా పని చేస్తామని తెలిపారు.

సీఎం కప్ -2026 పోటీలలో వివిధ క్రీడాంశాలలో ప్రతిభ చూపిన క్రీడాకారులను గుర్తించి,వారికి తగిన ప్రోత్సాహకాలు, శిక్షణ అవకాశాలు కల్పించబడతాయన్నారు. ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వ వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7 తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగుతాయన్నారు.

యువతకు క్రీడలపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంబంధిత అధికారులు, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శులు, క్రీడా సంఘాలు, యువత అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్,ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply