Agriculture | ప్రకృతి వ్యవసాయంతో భూసారాన్ని పెంపొందించుకోవచ్చు

Agriculture | ప్రకృతి వ్యవసాయంతో భూసారాన్ని పెంపొందించుకోవచ్చు
- ఏవో అంజిత్ కుమార్.
Agriculture | దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రకృతి వ్యవసాయంతో రైతులకు అధిక లాభం కలుగుతుందని మండలంలోని దండేపల్లి ఏవో గొర్ల అంజిత్ కుమార్ అన్నారు. ఈ రోజు దండేపల్లి గ్రామంలో (న్యాచురల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫామింగ్ ) పై రైతులకి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రకృతి వ్యవసాయం చేయడం వలన సాగు ఖర్చు తగ్గడంతో పాటు, భూమి సారాన్ని పెంచుకోని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం వలన రైతులు అధిక లాభాలు పొందవచ్చని అన్నారు., ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి తెలియజేశారు. వ్యవసాయంలో వేప నూనె అవశ్యకత గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతుసంఘం సభ్యులు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
