Invasion | అమెరికా ఆధిపత్యం..

Invasion | అమెరికా ఆధిపత్యం..

Invasion | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌పంచంలో సోష‌లిస్టు దేశ‌మైన చైనా అడుగిడిగిన చోట అమెరికా అంక్ష‌లు, పెత్త‌నం చెలాయిస్తూ అవ‌స‌ర‌మైతే పాల‌నా వ్య‌హారాల్లో కూడా త‌ల‌ దూరుస్తోంది. ర‌ష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న చైనా, ఇండియాతో పాటు ర‌ష్యాపై (Russia) కూడా టారిఫ్ ప్ర‌భావం చూపింది. అయినా ఏ ఒక్క దేశం కూడా వెనుకంజ వేయ‌లేదు. టారిఫ్‌లను పట్టించుకోని దేశాల‌పై దండ‌యాత్ర ప్రారంభించింది. ఇందులో భాగమే వెనెజువెలాపై అమెరికా సైన్యం దాడి.

Invasion | అమెరికా గుప్పెట్లోకి ఆయిల్ అమ్మ‌కాలు

ప్ర‌పంచ నియంత అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న ల‌క్ష్య‌సాధ‌న వైపు అడుగులు వేస్తున్నారు. చ‌మురు ఉత్ప‌త్తి దేశాల‌ను త‌మ గుప్పెట్లోకి తీసుకుంటే ప్ర‌పంచాన్ని శాసించవ‌చ్చున‌ని అమెరికా వ్యూహం. అమెరికా త‌న‌ గుప్పెట్లోకి ఆయిల్ తీసుకుంటుంది. చైనా, భార‌త్ లాంటి పెద్ద దేశాలు రష్యా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, వెనిజులా వంటి దేశాల నుండి ముడి చమురును కొనుగోలు చేస్తుంది.

ముఖ్యంగా రష్యా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ నుండి అధిక మొత్తంలో కొనుగోళ్లు చేస్తూ, వెనిజులా, గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలు (కువైట్, ఒమన్, ఖతార్, యూఏఈ) ఇతర ప్రాంతాల నుండి కూడా దిగుమతి చేసుకుంటుంది. అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా, ఇరాన్, వెనిజులా వంటి దేశాల నుండి చైనా, ఇండియా (India) ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా, ఆ దేశాలకు ఆర్థికంగా మద్దతునిస్తూ తన ఇంధన అవసరాలు తీర్చుకుంటుంది. ఇదీ అమెరికాకు న‌చ్చ‌డం లేదు.

Invasion

Invasion | వ్యాపార‌ప‌రంగా ఏ దేశానికి చైనా మ‌ద్ద‌తు ఇస్తుందో…

ఏ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతం కావ‌డానికి వ్యాపార‌ప‌రంగా చైనా మ‌ద్ద‌తు ఇస్తుందో అలాంటి దేశాలు అమెరికాకు ప్ర‌త్య‌ర్థి దేశాల‌వుతాయి. అమెరికా ఆంక్ష‌లు ఉన్నా, చైనా లాంటి పెద్ద దేశాల‌కు చ‌మురు ఉత్ప‌త్తులు స‌ర‌ఫ‌రా అవుతున్నాయి. ఇదీ అమెరికా జీర్ణించుకోలేక‌పోతుంది కూడా. చైనా అతిపెద్ద సరఫరాదారులలో ర‌ష్యా ఒకటి, అలాగే ఇండియాకు (India) కూడా స‌ర‌ఫ‌రా చేస్తోంది. ఇటీవల కాలంలో దిగుమతులు గణనీయంగా పెరిగాయి. జీసీసీ దేశాలలో ప్రధాన సరఫరాదారు, చైనాకు ముఖ్యమైన ముడి చమురును అందిస్తోంది సౌదీ అరేబియా. ఇరాన్‌పై పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ, చైనా ఇరాన్ నుండి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది.

ఇది ఇరాన్‌కు ముఖ్యమైన ఆదాయ వనరు. ఇరాక్ కూడా చైనాకు చమురు ఎగుమతి చేసే అతిపెద్ద దేశాలలో ఇది కూడా ఒకటి. వెనిజులాలో అమెరికా (America) ఆంక్షల కారణంగా ఉత్పత్తి తగ్గినప్పటికీ, చైనా వెనిజులా చమురు రంగానికి ప్రధాన పెట్టుబడిదారుగా, కొనుగోలుదారుగా ఉంది. కువైట్, ఒమాన్, ఖతార్, యూఏఈ వంటి దేశాల నుండి కూడా చైనా పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకుంటుంది.

Invasion

Invasion | 50 మిలియ‌న్ బ్యారెళ్ల‌ ఇంధ‌నం అమ్మ‌నున్న వెనెజువెలా

వెనెజువెలా దేశం పాల‌నా వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూల్చిన అమెరికా, ఇప్పుడు ఇంధ‌న అమ్మ‌కాల‌ను (Sales) త‌మ గుప్పెట్ట పెట్టుకుంటున్నారు. ఆ దేశం నుంచి సుమారు 50 మిలియ‌న్ బ్యారెళ్ల ఇంధ‌నాన్ని కొనుగోలు చేయ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. అయితే మార్కెట్ ధ‌ర‌కే వెనిజులా ఆ ఇంధ‌నాన్ని అమ్మ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

ఆ దేశ‌ ప్ర‌జ‌ల బెనిఫిట్ కోసం ఆ డ‌బ్బును ఖ‌ర్చు చేస్తార‌ని ట్రంప్ తెలిపారు. అమెరికాలోని అన్‌లోడింగ్ (Unloding) డాక్స్‌కు ఆ ఇంధ‌న నౌక‌ల‌ను త‌ర‌లిస్తార‌ని ట్రంప్ పేర్కొన్నారు. వెనెజువెల‌ ఇంధ‌నాన్ని అమ్మే ప్ర‌క్రియ ప‌నుల‌ను ఎన‌ర్జీ మంత్రి క్రిస్ రైట్ చూసుకుంటున్నార‌న్నారు. చెవ్రాన్‌, కొనాకోఫిలిప్స్‌, ఎక్సాన్‌మోబిల్ లాంటి కంపెనీలు త్వ‌ర‌లో ట్రంప్‌ను క‌ల‌వ‌నున్నాయి.

Invasion | వెనెజువెలాలో మూడు బిలియ‌న్ బ్యారెళ్ల ఇంధ‌న నిక్షేపాలు

వెనెజువెలాలో సుమారు 300 బిలియ‌న్ బ్యారెళ్ల ఇంధ‌న నిక్షేపాలు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. అమెరికా (America) క‌న్నా నాలుగు రెట్లు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు భావిస్తున్నారు. 1990 ద‌శ‌కంలో ప్ర‌తి రోజు 3.5 మిలియ‌న్ బ్యారెళ్ల ఇంధ‌నాన్నివెనెజువెలా తోడేది. ఆ సామ‌ర్థ్యం క్ర‌మంగా త‌గ్గింది. అవినీతి పెరిగిపోవ‌డంతో పంపింగ్ 8 ల‌క్ష‌ల బ్యారెళ్ల‌కు త‌గ్గిపోయింది.

అయితే ఇప్పుడు అమెరికా కంపెనీలు మ‌ళ్లీ వెనెజువెలాలో (venezuela) ఇంధ‌న ప‌రిశ్ర‌మ‌ను బ‌లోపేతం చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే బిలియ‌న్ల‌లో ఇన్వెస్ట్ చేయాల‌ని ఆలోచిస్తున్నారు. దెబ్బ‌తిన్న వెనిజులా చ‌మురు వ్య‌వ‌స్థ‌ను మ‌ళ్లీ గాడిలో పెట్ట‌నున్న‌ట్లు ట్రంప్ చెప్పారు.

CLICK HERE TO READ చంద్రుడిపై నివాసం..! ఎప్పటికి సాధ్యం..?

CLICK HERE TO READ MORE

Leave a Reply