voter list | 10న తుది ఓటర్ జాబితా విడుదల చేస్తాం

voter list | 10న తుది ఓటర్ జాబితా విడుదల చేస్తాం

  • మున్సిపల్ కమిషనర్ వెంకట్ రామిరెడ్డి

voter list | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : నిబంధనల ప్రకారం ఈ నెల 10వ తేదీన తుది ఓటర్ జాబితాను విడుదల చేస్తామని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2026 మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి
చౌటుప్పల్ పురపాలక సంఘంలో ముసాయిదా ఓటర్ జాబితా(voter list) పై అభ్యంతరాలు, సూచనలు తెలియజేయుట కోసం అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో కమిషనర్ వెంకటరామిరెడ్డి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ముసాయిదా ఓటర్ జాబితాలో గల తప్పులు, చనిపోయిన వారి పేర్ల పరిశీలన, ద్వంద్వ నమోదులు, పోలింగ్ స్టేషన్(Polling station)ల మార్పులు తదితర అంశాలపై అభ్యంతరాలు, సూచనలు తెలుపాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి నిబంధనల ప్రకారం తుది ఓటర్ జాబితాను రూపొందించి 10 వ తేదీన విడుదలచేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నీ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్ వో అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, ఎస్ ఐ హనుమాన్ ప్రసాద్, ఈ ఈ రేణు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply