Rs. 12.29 crore | పేదలకు అండగా..

Rs. 12.29 crore | పేదలకు అండగా..
- సీఎం సహాయనిధితో భరోసా
- మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
Rs. 12.29 crore | విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : అనారోగ్యానికి గురై కష్టాలలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి ఆపన్నహస్తంగా నిలుస్తోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఎల్‌ఓసీలను ఎమ్మెల్యే(MLA) లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు సందేశ పత్రాలను కూడా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విజయవాడ రూరల్ మండల పరిధిలో ఏడుగురికి రూ.3.97 లక్షలు, ఇబ్రహీంపట్నం మండలంలోని ఐదుగురికి రూ.2.36 లక్షలు తాజాగా మంజూరైనట్లు స్పష్టం చేశారు. తాజాగా మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 1485 మందికి రూ.12.29 కోట్ల(Rs. 12.29 crore) ముఖ్యమంత్రి సహాయనిధిని అందజేసినట్లు వెల్లడించారు. తాజాగా నియోజకవర్గంలో 79 మందికి రూ.87 లక్షల సీఎంఆర్ఎఫ్ మంజూరైనట్లు వెల్లడించారు.
వీటిలో 38 మందికి రూ.21.20 లక్షలు రీఎంబర్స్‌మెంట్ చెక్కులు కాగా, 41 మందికి రూ.65.80 లక్షలు ఎల్ఓసీల రూపంలో మంజూరైనట్లు వివరించారు. వీటిని సద్వినియోగం చేసుకుని అందరూ ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఉత్తమ కార్యకర్తగా ప్రసంశ పత్రం పొందిన వీరాస్వామిని ఘనంగా సత్కరించి, ప్రత్యేకంగా అభినందించారు. ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
