Science Fair | విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి….

Science Fair | విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి….

Science Fair | ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో రాణించాలని చిన్నపోర్ల సర్పంచ్ గాండ్ల నికిత ప్రశాంత్, మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్ల జడ్.పి.హెచ్.ఎస్, పాఠశాల విద్యార్థులు సైన్స్ ఫెయిర్(Science Fair) లో ప్రతిభ చాటడంతో విద్యార్థులను ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో తమ గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రతిభ‌ చాటడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు వివిధ రంగాల్లో రాణిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. 7వ తరగతి విద్యార్థినులు జోహా, మారియా హజీరా బేగంలను జాజాపూర్, నారాయణపేటజిల్లాలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో ద్వితీయ బహుమతి సాధించడంతో వారిని అభినందించి సన్మానించారు.

10వ తరగతి విద్యార్థిని సోబియా సమీన్ మొహమ్మద్ మహబూబ్ అలీ జిల్లా స్థాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్‌లో ద్వితీయ బహుమతి పొందినందుకు సన్మానించారు. విద్యార్థుల విజయాని(victory)కి మార్గదర్శకత్వం చేసిననయీమా బేగం ఎస్‌ఏ బయో సైన్స్ ఉపాధ్యాయురాలు సన్మానించగా నూతనంగా గెలుపొందిన ప్రజాప్రతినిధులను ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఎండి మొహిద్దిన్ అహ్మద్, ప్రశాంత్ గండ్లా ,బండే నవాజ్ వార్డ్ మెంబర్, చంద్ పాషా సాబ్, ఉపాధ్యాయులు గులాం రసూల్, వసీమ్ ఫాతిమా, సల్మా బేగం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply