Narsimhulapet | రైతులకు కొరత లేకుండా యూరియా సరఫరా

Narsimhulapet | రైతులకు కొరత లేకుండా యూరియా సరఫరా
- జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సరిత
Narsimhulapet | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : రైతులకు కొరత లేకుండా యూరియా సరఫరా జరుగుతోందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సరిత అన్నారు. ఈ రోజు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో జరుగుతున్న యూరియా పంపిణీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా నిల్వలు ఉన్నాయని ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. యాసంగి పంట కాలానికి అవసరమైన మేరకు యూరియాను ముందుగానే కేంద్రాలకు చేరవేశామని, గందరగోళానికి గురికాకుండా నిబంధనల ప్రకారం యూరియా పంపిణీ జరుగుతుందని అన్నారు. పంపిణీ సమయంలో రైతులు యూరియా కార్డు, తమ ఆధార్ పంట వివరాలు చూపించాల్సి ఉంటుందని అన్నారు. రైతుల సహకారంతో సమస్యలు లేకుండా సరఫరా సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వినయ్ కుమార్, ఏఈఓ లు మౌనిక, సీఈవో వెంకన్న, శివాజీ తదితరులు ఉన్నారు.
