Kadem | కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కడెం ప్రాజెక్టు అభివృద్ధి

Kadem | కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కడెం ప్రాజెక్టు అభివృద్ధి
- ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్
Kadem | కడెం ( నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లాలోని అతి పెద్దదైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేయడంతో ప్రస్తుతం యాసంగికి సకాలంలో నీరు అందించడంతో కడెం ఆయకట్టు సస్యశ్యామలం కానుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఈ రోజు కడెం ప్రాజెక్టు ఎడమ కాలువకు నీటిని కడం ఆయకట్టు పరిధిలో గల కాల్వలకు సాగునీరును ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జు పటేల్ స్థానిక ప్రజాప్రతినిధులు నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతులు యాసంగి సీజన్ లో సకాలంలో పంటలను పండించాలన్నారు. కడెం ప్రాజెక్టు మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం 9 కోట్ల 46 లక్షలు ఖర్చుతో ప్రాజెక్టు పూర్తిస్థాయి మరమ్మత్తులు చేసిందన్నారు. త్వరలో పూడికను తొలిగిస్తామని, రోడ్డుకు మరమత్తులు చేపడతామని పేర్కొన్నారు.
గతంలో తెలంగాణ రాష్ట్రంలో పాలన కొన సాగించిన టిఆర్ఎస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్టు మరమ్మతుల గురించి పట్టించుకోక పోగా నిధులు కూడా మంజూరు చేయకపోవడం వల్ల గత కొన్ని ఏళ్ల నుండి కడం ప్రాజెక్టుకు ప్రతి వర్షాకాలం సీజన్ లో పెను ప్రమాదం ముంచుకో వస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కడెం ప్రాజెక్టు పరిస్థితి గురించి తాము జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికొ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా కడం ప్రాజెక్ట్ మరమ్మతుల కోసం రూ. 9 కోట్ల 46 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయగా ఆ నిధులతో ప్రాజెక్టు వరద గేట్ల మరమ్మతులు ప్రాజెక్ట్ అభివృద్ధి పనులు ప్రాజెక్టుపై విద్యుత్తు సంబంధించిన పనులు చేపట్టడంతో ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేకుండా కడం ప్రాజెక్ట్ ఆయకట్టు కింద రెండు పంటలకు ప్రాజెక్టు సాగునీరు సరఫరా చేసే అవకాశం కలిగిందన్నారు.
ఆయా కట్టు రైతులు రబీ నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి భూషన్, ఆత్మ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, కడెం ప్రాజెక్టు ఈ ఈ ప్రవీణ్ కుమార్, కడెం మండల తహసిల్దార్ ఆర్ ప్రభాకర్, ఎంపీడీవో సునీత, పెద్దూర్ కడం సర్పంచ్ ఢీకొండ విజయ్ కుమార్, ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, కన్నాపూర్ మాజీ సర్పంచ్ ఎల్ నరేందర్ రెడ్డి, కిసాన్ సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బి. రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఆర్ రమేష్ రావు, కొండాపురం లక్ష్మణ్, బొడ్డు గంగన్న, ఆకుల లచ్చన్న, తక్కల సత్తన్న, బొంతల భూమన్న, షేక్ రఫీక్, బబ్లు, ధర్మయ్య, వాజీద్, నీటిపారుదల శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
