Honor | మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

Honor | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా మండలంలోని జాగిర్యాల్ గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ గడాల ప్రసాద్ హాజరై ముందుగా పాఠశాల మహిళా ఉపాధ్యాయులను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.

ఈసందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ… సావిత్రిబాయి పూలే ఆశయాలు మరువలేనివన్నారు. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి దేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయురాలు స్త్రీల కోసం, స్త్రీల అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటం చేసి ఎన్నో పాఠశాలలు నిర్మించిన స్ఫూర్తి దాత సావిత్రమ్మకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేశ్వర్, వార్డ్ సభ్యులు రాజేశ్వర్, సుదర్శన్, కళ్యాణ్, పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, యువజన సంఘాల నాయ‌కులు పాల్గొన్నారు.

Leave a Reply