Karimabad | అలుపెరుగని పోరాట యోధుడు కా.ఎ.బి.బర్ధన్

Karimabad | అలుపెరుగని పోరాట యోధుడు కా.ఎ.బి.బర్ధన్

  • సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాష్ మియా
  • సిపిఐ ఆధ్వర్యంలో బర్ధన్ వర్థంతి
  • నివాళులు ఘటించిన సిపిఐ నాయకులు

Karimabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : దేశంలోనే ఆదర్శ కమ్యూనిస్టు నేత కామ్రేడ్ ఎ.బి.బర్ధన్ జీవితం ఆదర్శమని సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ బాష్ మియా అన్నారు. ఇవాళ‌ శివనగర్ లోని సిపిఐ జిల్లా కార్యాలయం తమ్మెర బవన్ లో సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ ఏబి బర్ధన్ 10వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈసందర్భంగా షేక్ బాష్ మియా మాట్లాడుతూ… భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మాజీ జాతీయ కార్యదర్శి ఎ.బి.బర్ధన్ తన చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు సిద్ధాంతాలను అనుసరించి ప్రజలతో, కార్యకర్తలతో నిరాడంబరమైన జీవితాన్ని గడిపారన్నారు. బర్ధన్ 1924 సెప్టెంబర్ 24న నాగపూర్ లో జన్మించి విద్యార్థి దశ నుంచి ఏఐఎస్ఎఫ్ లో పనిచేశార‌న్నారు. కమ్యూనిస్టు భావాలతో ఎదిగి నాగపూర్ ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేస్తూ దేశంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తూ సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శిగా కమ్యూనిస్టు ఉద్యమానికి విశేష సేవలు అందించడంతో పాటు దేశంలో మంచి కమ్యూనిస్టు నేతగా పేరు సంపాదించాడ‌ని, గత కేంద్ర ప్రభుత్వం బర్ధన్‌ కు ఉపరాష్ట్రపతి పదవిని ఇచ్చేందుకు ముందుకు వచ్చినా.. ఆ పదవిని బర్ధన్ తీసుకోకుండా సున్నితంగా తిరస్కరించార‌న్నారు. త‌న జీవితం ప్రజలు, పార్టీ కార్యకర్తలతోనే అని చెప్పడం బర్ధన్‌ నిస్వార్థతకు అద్దం పడుతోందన్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గుండె బద్రి గన్నారపు రమేష్, జిల్లా సమితి సభ్యులు తాళ్లపల్లి రాహేలా, ఓర్సు రాజు, పరికరాల రమేష్, ఎండి అక్బర్, పాషా, చిట్యాల సువర్ణ, నల్ల తీగల కుమార్, జన్ను రాజు, బిర్రు ప్రభాకర్, కరుణాకర్, దాసు వెంకటాద్రి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply